- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: ప్రజా ఉద్యమాలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కుట్ర.. రేవంత్ విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ పార్టీ చేసే ప్రజా ఉద్యమాన్ని టీఆర్ఎస్ అడ్డుకునే కుట్ర చేస్తుందని, అధికారంలో ఉండి కూడా రోడ్లపైకి వచ్చి తామే ఆందోళన చేస్తున్నట్లు నాటకమాడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. టీపీసీసీ జూమ్ మీటింగ్ బుధవారం ఉదయం నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసనల కార్యక్రమాన్ని పార్టీ నేతలకు వివరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ చేసిందని, ఈ ఉద్యమంలో పార్టీ వర్గాలన్నీ కలిసికట్టుగా రావాలని కోరారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గే వరకు, రైతులు పండించిన పంటలు చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటాలు సాగుతాయని, దీనిలో భాగంగా బుధవారం అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ల వద్ద ధర్నాలు విజయవంతంగా చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ తమ పక్షాన పోరాటం చేస్తుందని ప్రజలు విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం ఐదు అంశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి చార్జీలు తగ్గించే వరకు పోరాటాలు జరగాలని, రైతులకు భరోసా వచ్చే వరకు ప్రతి వరి గింజ కొనే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైఖరిపై ఉద్యమాలు చేయాలని, ఈ ప్రజా ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించాలన్నారు. .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులకు నష్టం చేసే పరిస్థితులు తెస్తున్నారని, ముడిబియ్యం, ఉప్పుడు బియ్యం అంటూ అసలు ఇష్యూను పక్కదారి పట్టిస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
ఏ బియ్యం, ఎవరైనా కొనాలని, కానీ, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని, దీనిలో భాగంగా రేపు విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడి పెద్ద ఎత్తున జరుగాలని సూచించారు. ప్రతి నాయకుడు ఉద్యమంలో పాల్గొనాలని, కాంగ్రెస్ ఉద్యమాన్ని టీఆర్ఎస్ అడ్డుకునే కుట్ర చేస్తుందన్నారు. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలని, పోలీస్ స్టేషన్లలో కూడా ఉద్యమం కొనసాగాలని పిలుపునిచ్చారు. దీనిపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నెలాఖరున వరంగల్‌లో జరిగే సమావేశానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రావాలని ప్రతిపాదన పెట్టామని, డీసీసీ అధ్యక్షులతో కూడా సమావేశం ఉంటుందని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ జూమ్ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మల్సీ జీవన్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్ కృష్ణన్, బోసురాజు, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, పలు జిల్లాల డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు..