- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
REVANTH REDDY: ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన CM రేవంత్ రెడ్డి.. కారణం ఇదేనా?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా తన ట్విట్టర్ ఖాతా బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన స్క్రీన్ షార్ట్ ఫొటో కూడా జనాలు నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే సీఎం ట్విట్టర్ ఖాతా బ్లాక్ చేయడానికి ప్రజల సమస్యలే కారణమంటున్నారు పలువురు నెటిజన్లు. ప్రజల సమస్యలు చెబుతుంటే వినలేకనే బ్లాక్ చేశారని తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు డీఎస్సీలో పోస్టులు పెంచాలని, నీట్ రద్దు చేయాలని, 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 మెయిన్ ఎంపిక చేయాలని విద్యార్థి సంఘాల టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడం.. ఇటు పెట్టుబడి కోసం చేసిన అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం.. ఈ సమస్యలు పరిష్కారించాలని.. ఈ ఆత్మహత్యలు ఇప్పటికైనా ఆగేలా తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో, ఆ సమస్యలు వినలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.