Revanth: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ

by Ramesh Goud |
Revanth: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టాలీవుడ్ హీరో(Tollywood Hero) సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. తెలంగాణలో వరదల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి(CM Relief Fund)కి సిద్దు జొన్నలగడ్డ ప్రకటించిన విరాళాన్ని ఇచ్చేందుకు జూబ్లీహిల్స్(Jubili Hills) లోని సీఎం నివాసానికి తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద సహాయానికి సంబంధించి రూ.15 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించి, వరద బాధితుల సహాయార్ధం పెద్ద మనసుతో ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు(Thank You) తెలిపారు. కాగా తెలంగాణ లో వరదల సమయంలో పలువురు ప్రముఖులు వరద బాధితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు అందజేశారు. ఈ నేపధ్యంలోనే డీజే టిల్లు సినిమాతో ఫేమస్ అయిన సిద్దు జొన్నలగడ్డ కూడా వరద బాధితుల సహాయార్థం రూ.15 లక్షలు ప్రకటించారు.

Advertisement

Next Story