Revanth: సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం.. కులగణనపై సీఎం స్పెషల్ ట్వీట్

by Ramesh Goud |   ( Updated:2024-11-06 12:38:10.0  )
Revanth: సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం.. కులగణనపై సీఎం స్పెషల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రవ్యాప్తంగా కుల గణన(Caste Census) కార్యక్రమం చేపట్టడం దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్(CM Special Tweet) చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై సీఎం.. ఆకాశం -భూమి ఏకమై, అవకాశాల్లో సమానత్వం, అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం చేస్తోన్న యజ్ఞం ఇదని తెలిపారు. అలాగే నేడు తెలంగాణ గడ్డ పై మొదలై.. రేపు రాహుల్ సారథ్యంలో దేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చే సాహసం ఇది అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story