Good News: జాబ్స్ కోసం వెతుకుతున్నారా? రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

by Prasad Jukanti |
Good News: జాబ్స్ కోసం వెతుకుతున్నారా? రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ కొత్తగా ఏఐ ఆధారిత ‘డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సెంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్)’ (Digital Employment Exchange of Telangana) ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థల సమన్వయంతో ఉద్యాగార్థులకు, ఉద్యోగదారులకు మధ్య వారధిగా ఉండేలా ఈ ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ ఫారమ్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ప్లాట్ ఫారమ్ ఉద్యోగార్థుల నైపుణ్యాలతో ఉద్యోగ అవకాశాలను సరిపోల్చి అందుకు సంబంధించి సమయానుకూల వాస్తవ సందేశాలను అందజేస్తుంది. వివిధ కంపెనీలు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలు, అప్రెంటీస్ షిప్ (Apprenticeship), ఇంటర్న్ షిప్ (Internship) ల వివరాలు ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంచుతారు. నిరుద్యోగులతో పాటు ఫైనల్ ఇయర్ లో ఉన్న విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా సులభంగా ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునే అవకాశం దక్కనున్నది. వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులకు కంపెనీలు తమ అవసరాలకు తగిన ఉపాధి అవకాశాలకు సంబంధించిన మెసేజులు, ఈ-మెయిల్స్ పంపడంతో పాటు కాల్స్ చేసి ఇంటర్వ్యూలకు (Interview) పిలుస్తాయి. అభ్యర్థులు ఇచ్చే వివరాలతో ఈ పోర్టల్ రెజ్యూమ్ ను బిల్డ్ చేసుకుని ఇంటర్వ్యూ తరయారీకి మద్దతుగా నిలుస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ఇటు ఉద్యోగార్థులతో పాటు ఉద్యోగదారులకు ప్రయోజనం కలగనున్నది. విభిన్న రకాల నైపుణ్యం, అర్హత గల అభ్యర్థులతో అనుసంధానం ద్వారా మెరుగైను నైపుణ్యాలు కలిగిన వారికి ఎంపిక చేసుకునే వీలు కంపెనీలకు కలగనున్నది.

డీట్ లో ఉద్యోగార్థుల నమోదు ప్రక్రియ:

గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి డీట్ యాప్ ను డౌన్ లోడు చేసుకోవాలి. అక్కడ ఉద్యోగార్ధిగా సైన్ అప్ చేసుకోవాలి. తర్వాత పేరు, ఇంటి పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, డేట్ ఆప్ బర్త్, లింగం, విభన్న వికలాంగులు, సామాజిక స్థితి, చిరునామా వంటి ప్రాథమిక వివరాలు సమర్పించి సైన్ అప్ అవ్వాలి. తెలిసిన భాషలు, అత్యున్నత విద్యార్హత, నైపుణ్యాలు, విద్యాభ్యాస సమాచారం, అనుభవం వంటి ప్రొఫైల్ సమాచారాన్ని పూరించి దరఖాస్తు సమర్పించాలి.

సైన్ అప్ తర్వాత..

యాప్ లాగిన్ చేసుకుని మెనూకి వెళ్లాలి. ఉద్యోగాలను అన్వేషించాలి. అక్కడ మీకు సరిపోలే ఉద్యోగాల వివరాలు తెలుసువచ్చు. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు సెక్షన్ లో అందుబాటులో ఉన్న నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు. అకౌంట్ అప్ డేట్, కార్యచరణ, సంభాషణలు, షెడ్యూల్ చేయబడిన ఇంటర్వ్యూల వివరాలు, డీట్ నుంచి వెలువడే ప్రకటనలు అన్ని ఇక్కడ చూసుకునే వీలు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed