- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ అమరుల దినోత్సవం నాడు రిటైర్డ్ ఐపీఎస్‌కి అవమానం! హరీశ్‌రావు ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పరేడ్‌కు రమ్మని ఆహ్వానించి, నన్ను నిన్న రాత్రి నుండే గృహ నిర్బంధంలో ఉంచారని బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు సోదరులకు నివాళులు అర్పించే అర్హత కూడా నాకు లేదా? నేనేమైనా టెర్రరిస్టునా? అని సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు.
‘ఆహ్వానించింది మీరే.. అరెస్ట్ చేసింది మీరే.. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని, పోలీసు అమరవీరుల దినోత్సవం రోజే అవమానించడం సిగ్గుచేటు. పోలీసుల పట్ల మీ కపట ప్రేమకు ఇది మరో నిదర్శనం, రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు ప్రభుత్వాలు పని చేయాలి గానీ, ఇలా అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ నిర్బంధాల పాలన చేయడం దుర్మార్గం’ అంటూ సీఎంవో ఆఫీస్, సీఎం రేవంత్‌రెడ్డికి ఎక్స్ వేదికగా ఈ విషయాలు ట్యాగ్ చేశారు. కాగా, గ్రూప్-1 రద్దు చేయాలని వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు గృహనిర్భందం చేశారు.