మంజూరు చేసిన నిధులను క్యాన్సల్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం : సంగారెడ్డి ఎమ్మెల్యే

by Aamani |
మంజూరు చేసిన నిధులను క్యాన్సల్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం : సంగారెడ్డి ఎమ్మెల్యే
X

దిశ, సంగారెడ్డి : గతంలో వార్డు అభివృద్ధి కోసం ప్రతి వార్డుకు రూ. కోటి చొప్పున నిధులను మంజూరు చేయడం జరిగిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. కానీ ప్రభుత్వం మారడంతో మంజూరైన నిధులు క్యాన్సల్ అయ్యాయని ఆరోపించారు. బుధవారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని సంగారెడ్డి పట్టణంలోని 30 వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని పూలే విగ్రహానికి కాలనీ వాసులతో కలిసి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాల, ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. గత ప్రభుత్వంలో సంగారెడ్డి లోని 30వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయని గుర్తించి వార్డు అభివృద్ధి కోసం రూ.1కోటి చొప్పున ప్రతి వార్డుకు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం మారడంతో మంజూరైన నిధులు క్యాన్సల్ అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా తనవంతుగా వార్డు అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి ,విజేందర్ రెడ్డి, అనంతయ్య , బీరయ్య యాదవ్, ఆంజనేయులు ,అన్వర్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story