ప్రధాని మోదీని కలిసిన ఎమ్మెల్యే

by Naveena |
ప్రధాని మోదీని కలిసిన ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 27: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ బుధవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో..18 మంది ప్రతినిధుల బృందం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రిని శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తు రాబోయే స్థానిక ఎన్నికల గురించి చర్చించడం జరిగిందన్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దిశనిర్దేశం చేశారన్నారు. తెలంగాణకు చెందిన 18 మంది బీజేపీ ప్రతినిధులు ప్రధానమంత్రితో సమావేశం కావడం రాష్ట్ర అభివృద్ధి బలోపేతం చేయడం, కీలకమైన ప్రాంతీయ సమస్యలను పరిష్కరించడంపై బీజేపీ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ తెలిపారు.

Advertisement

Next Story