Red Alert of very heavy rains in Telangana : తెలంగాణకు రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

by GSrikanth |   ( Updated:2023-07-18 12:53:18.0  )
Red Alert of very heavy rains in Telangana : తెలంగాణకు రెడ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్, ఒరిస్సా ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో.. నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని పశ్చిమ జిల్లాలు సహా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్టు చెప్పారు.

ఒకటి రెండు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మెహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. సిద్దిపేట, జనగాం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్ష సూచన జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed