సిద్దమైన కేసముద్రం రైల్వే ట్రాక్.. రేపటి నుండి యధావిధిగా రైళ్లు

by M.Rajitha |
సిద్దమైన కేసముద్రం రైల్వే ట్రాక్.. రేపటి నుండి యధావిధిగా రైళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో కురిసిన భారీ వర్షాలు, వరద ధాటికి మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె-కేసముద్రం(Kesamudram) మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసం అయిన సంగతి తెలిసిందే. యుద్ద ప్రాతిపదికన పనులు ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 36 గంటల్లో ట్రాక్ ను పునరుద్దరించింది. మొత్తం ఐదు చోట్ల ట్రాక్ పూర్తిగా పాడవగా.. 1000 మంది కార్మికులు పునరుద్దరణ పనుల్లో పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఈ ట్రాక్ మీద విజయవాడ- సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ ప్రెస్ (Golconda Express) రైలును ట్రయల్ రన్ చేశారు అధికారులు. కాగా అప్ లైన్ పనులన్నీ పూర్తయ్యాయని, డౌన్ లైన్ పనులు బుధవారం రాత్రి వరకు పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు అన్నారు. కాగా ఈరోజు మరిన్ని రైళ్లను నెమ్మదిగా నడిపి, రేపటి నుండి అన్ని రైళ్లను యధావిధిగా నడిపిస్తామని తెలిపారు.

Next Story

Most Viewed