- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ravneet Singh: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 27 శాతం పూర్తి : రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ అన్నారు. ఇవాళ ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కొనసాగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు 27 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ప్రతి రోజూ 2 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. 2026లోపు స్టేషన్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అతి త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతోందని రవ్‌నీత్ సింగ్ పేర్కొన్నారు.
Advertisement
Next Story