తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదమెందుకు?: రసమయి సీరియస్

by GSrikanth |
తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదమెందుకు?: రసమయి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తల్లి విగ్రహా మార్పుపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే మార్పు తథ్యం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు స్పష్టం చేస్తుండగా.. ముందు అభివృద్ధిపై దృష్టి పెట్టండంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. ఈ అంశంపై మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, కళాకారుడు రసమయి బాలకిషన్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని దేశమంతా చూసిందని అన్నారు. కేసీఆర్‌ పాలనను తరచూ రాచరికం అనడం సమంజసం కాదని తెలిపారు.

రాచరిక పోకడలన్నీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలోనే కనిపిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తిభావం కలిగేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తల్లి చేతిలో జొన్నల కంకి, బతుకమ్మను పెట్టినట్లు గుర్తుచేశారు. దేవతలకు కిరీటం ఉంటుందని.. దానిని రాచరికం అంటే ఎలా అని రసమయి ప్రశ్నించారు. తెలంగాణ తల్లి గురించి కాంగ్రెస్ నేతలు ఏనాడైనా ఆలోచించారా? అని అడిగారు. ఇన్నేళ్ల తర్వాత కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed