బంట్వారం బస్టాండ్‌లో మరుగుదొడ్లు కరువు..అవస్థలు పడుతున్న ప్రయాణికులు

by Aamani |
బంట్వారం బస్టాండ్‌లో మరుగుదొడ్లు కరువు..అవస్థలు పడుతున్న ప్రయాణికులు
X

దిశ,బంట్వారం: వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రానికి చెందిన RTC బస్టాండ్‌ప్రాంగణ కేంద్రంలో మరుగుదొడ్లు లేక మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,. మండల కేంద్రం నుండి ప్రతి రోజూ వికారాబాద్, తాండూరు, హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, ప్రాంతాలకు తరుచూ ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటారు. అంతేకాక పండగ సమయాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మండల కేంద్రానికి విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. వారు కూడా ఇలాంటి తరహా సమస్యలను ఎదుర్కుంటున్నామని విద్యార్థులు ఆవేదన తెలియపరుస్తున్నారు.

ప్రయాణికులకు ఏ ఇతర సౌకర్యాలు లేకున్నా పర్వాలేదు కానీ ప్రయాణ ప్రాంగణం లో త్రాగునీరు, మూత్రశాలలు మాత్రం తప్పనిసరిగా ఉండాలని మహిళా ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను వేడుకుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలు మాత్రం తీరడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మహిళా ప్రయాణికుల సమస్యను దృష్టిలో ఉంచుకొని తక్షణమే బంట్వారం మండల కేంద్రం బస్ స్టాప్ ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ ఆధ్వర్యంలో ఎన్నో సమస్యలు పరిష్కరించబడ్డాయని వాటి తరహాలోనే మా బంట్వారం మండల సమస్యను కూడా వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed