- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
దిశ, కేశంపేట: సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అబివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని బైర్ఖాన్ పల్లి గ్రామ పంచాయతీ తెట్టేకుంట తండాలో రూ. 15 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గొప్లాయ కుంట తండాకు చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అలాగే కొనాయపల్లి గ్రామంలో రూ. 17 లక్షల నిధులతో మంజూరైనా సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు.
మారుమూల పల్లెలతో పాటు తండాలో కోట్ల రూపాయల నిధులతో రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై. రవీందర్ యాదవ్, జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ పల్లె నర్సింగ్ రావ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, మండల యువత అధ్యక్షుడు తోట వెంకటేష్, ఆయా గ్రామాల సర్పంచులు కృష్ణయ్య, మల్లేష్, నాయకులు యాదగిరి రావ్, వెంకట్ రెడ్డి, జమాల్ ఖాన్, బాలరాజ్ గౌడ్, యారం శేఖర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్ , హనుమంత్ నాయక్, శ్రీశైలం, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.