వింటర్‌లో వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్ సూప్.. ఇలా చేసేయండి

by Kanadam.Hamsa lekha |
వింటర్‌లో వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్ సూప్.. ఇలా చేసేయండి
X

దిశ, ఫీచర్స్: శీతాకాలంలో వేడి వేడిగా సూప్ తాగుతుంటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చలికాలంలో సూప్ తాగితే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఇది నియంత్రిస్తుంది. అయితే, ఈ సూప్‌లలో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటిల్లో టమాట సూప్ ఒకటి. దీనిని తయారు చేసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. రెస్టారెంట్ స్టైల్‌లో టమాట సూప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావల్సిన పదార్ధాలు:

టమాటాలు, ఆనియన్, వెల్లుల్లి, ఉప్పు, నూనె, జీలకర్ర, దాల్చిన చెక్క పొడి, కొత్తిమీర, కారం, బ్రెడ్, బటర్

తయారీ విధానం: వెల్లుల్లి, ఆనియన్‌, కొత్తిమీరను సన్నగా తరగాలి. టమాట ముక్కలను కచ్చా పచ్చాగా మిక్సిలో పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, దాల్చిన చెక్క పొడి వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఆ తరువాత అందులో ఉల్లిపాయలు, వెల్లు్ల్లి వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమం వేగిన తరువాత అందులో టమాట పేస్ట్ వేసి, 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తదుపరి అందులో కొంచెం కారం, నీరు పోసి 10 నిమిషాల పాటు సన్నని మంట మీద వాటిని ఉడికించుకోవాలి. సూప్ కాస్త చిక్కగా ఉన్నప్పుడు అందులో కొత్తిమీరను చల్లండి. తరువాత బటర్‌లో బ్రెడ్ ముక్కలను వేయించి, వాటిని చిక్కటి సూప్‌పైన వేసి సర్వ్ చేసేకోవాలి. అంతే వేడి వేడిగా టమాట సూప్ రెడీ.

Advertisement

Next Story

Most Viewed