- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రీఛార్జి ప్లాన్ల రేట్ పెంపు లేనట్టే..!
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL)కు కొన్ని నెలల నుంచి కస్టమర్లు(Customers) పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పట్లో రీఛార్జి ప్లాన్ల రేట్లను(Recharge plans Rates) పెంచబోమని తెలిపింది. ఈ విషయాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(MD) రాబర్ట్ రవి(Robert Ravi) ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే టెక్నాలిజీలో కూడా కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు. స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్ లు, డైరెక్ట్-టు-డివైస్ వంటి కొత్త సేవలను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఇక బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలే ఫైబర్ నెట్(Fiber Net)యూజర్ల కోసం IFTV పేరుతో కొత్త సేవలను స్టార్ట్ చేసింది. ఇందులో 500కు పైగా లైవ్ టీవీ చానెళ్లు ఉన్నాయి. డేటాతో సంబంధం లేకుండా, బఫర్ సమస్య ఎదుర్కోకుండా వీటిని వీక్షించవచ్చని తెలిపింది.
కాగా జులైలో ప్రైవేట్ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను 10 నుంచి 27 శాతం వరకు పెంచాయి. దీంతో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఒక సెప్టెంబర్(September)లోనే ఏకంగా 8.5 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్ ను సబ్ స్క్రైబ్(Subscribe) చేసుకున్నారు. జియో(Jio), వొడాఫోన్ ఐడియా(Vi), ఎయిర్ టెల్(Airtel) వంటి కంపెనీలు దాదాపు కోటి మంది వినియోగదారులను కోల్పోయాయి. ఇందులో జియో ఒక్కటే 80 లక్షల మంది కస్టమర్లను నష్టపోయింది.