Monkeys:‘బాబోయ్ కోతులు’..బెంబేలెత్తుతున్న స్థానిక ప్రజలు!

by Jakkula Mamatha |
Monkeys:‘బాబోయ్ కోతులు’..బెంబేలెత్తుతున్న స్థానిక ప్రజలు!
X

దిశ,తలకొండపల్లి:తలకొండపల్లి మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది. దీంతో మహిళలు, చిన్నపిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కోతులు అడవులు, దేవాలయం వద్ద సంచరిస్తుండడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ ఈ వేసవి కాలం ఆరంభం నుంచి సుమారు ఆరు నెలలుగా తలకొండపల్లి మండల కేంద్రంలో విచ్చలవిడిగా కోతుల బెడద ఎక్కువైపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోన మదనపడుతూ ఆవేదనకు గురవుతున్నారు. ఇండ్ల పైకప్పులపై నిత్యం తిరుగుతూ ఇంటి గుమ్మం తెరవగానే ఇంట్లోకి వచ్చి కూరగాయలు, పప్పులు తదితర వస్తువులు ఎత్తుకెళుతుండడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇండ్లలోకి చొరబడ్డ సమయంలో ఎవరైనా వాటికి ఎదురు తిరిగి బెదిరించడానికి చూస్తే అవి మనుషులపై తిరిగి దాడి చేసి గాయపరుస్తున్నాయని పేర్కొంటున్నారు. ఆరు నెలలుగా కోతులు కొంతమంది వాహనదారుల పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కోతుల బెడద నుంచి మండల ప్రజలను కాపాడాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed