Prasanth Varma: ‘జై హనుమాన్’ లో హనుమంతుడిగా స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసిన ప్రశాంత్ వర్మ

by Hamsa |
Prasanth Varma: ‘జై హనుమాన్’ లో హనుమంతుడిగా స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేసిన ప్రశాంత్ వర్మ
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Verma), తేజా సజ్జా కాంబోలో తెరకెక్కిన ‘హనుమాన్’(Hanuman) చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీసును షేక్ చేసింది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’(Jai Hanuman) రాబోతున్నట్లు మేకర్స్ గతంలోనే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, ప్రశాంత్ వర్మ సినీ ప్రియులకు దీపావళి కానుకగా ‘జై హనుమాన్’(Jai Hanuman) అప్డేట్ విడుదల చేసి గుడ్ న్యూస్ తెలిపారు. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో హనుమంతుని పాత్రలో స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. విడుదలైన పోస్టర్‌లో రిషబ్ శ్రీరాముని విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించారు. ప్రజెంట్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాకుండా జై హనుమాన్‌ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Next Story