Task COO : ఉద్యోగాల కల్పనే ప్రజాపాలన లక్ష్యం

by Sridhar Babu |
Task COO : ఉద్యోగాల కల్పనే ప్రజాపాలన లక్ష్యం
X

దిశ, తలకొండపల్లి : ఉద్యోగాల కల్పనే ప్రజాపాలన లక్ష్యం అని టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు టాస్క్ సీఓఓ (TaskCOO)సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గత మూడు రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్​ (Los Angeles)లో జరిగిన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారికంగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తో కలిసి ఆయన వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో తెలంగాణ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లక్ష్యాల సాధన, స్మార్ట్ గవర్నెన్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలు, ఏఐ ఇన్నోవేషన్ కేంద్రంగా ఫ్యూచర్ సిటీగా మార్చాలన్నదే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ఆశయమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్‌ మెరుగుదల, ఈ-గవర్నెన్స్ కార్యకమాలు, స్కిల్ డెవలప్మెంట్, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లక్ష్యాల గురించి వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతమని, ప్రభుత్వం కంపెనీలకు తోడ్పాటు అందిస్తుందని వివరించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో ఉద్యోగాల కల్పననే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed