- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపాలి : కలెక్టర్
దిశ, రంగారెడ్డి బ్యూరో: జిల్లా అధికారులు సమన్వయంతో పని చేసి రంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయా భవనంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… అధికారులందరూ సమయ పాలన పాటించాలని అదేవిధంగా తమ కార్యాలయంలో ప్రతి వారం ఆయా శాఖల పురోగతిపై సమీక్షించుకోవాలని, లక్ష్యాలను అధిగమించకపోవడానికి గల కారణాలు తెలుసుకొని ఆ పనులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
పెండింగ్ పనులను ముందుగా పరిష్కరించాలని, ఒక శాఖను ఇంకో శాఖ వారు సమన్వయం చేసుకొని రాష్ట్ర స్థాయిలో రంగారెడ్డి జిల్లాకు మంచి పేరు తేవాలని దీనికి అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రతి పనిలో అంకిత భావం, నిరుపేదలకు సహాయం చేసే తన ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చుకోవాలని అన్నారు. ఏ విషయంలో నిర్లక్ష్యంగా ప్రదర్శించవద్దని అధికారులకు తెలిపారు. ఫీల్డ్ లో పర్సనల్ గా వారంలో 3 రోజులు ఖచ్చితంగా వెళ్ళి కింది స్థాయిలో శాఖ పని తీరును పరిశీలించి తగు ఆదేశాలు సిబ్బందికి ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్ళాలని, ఏ మాత్రం ఫైల్స్ పెండింగ్ పెట్టకుండా రూల్ ప్రకారం పనుల చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీమా సింగ్, డిఆర్ఓ సంగీత, ఏఓ సునీల్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.