- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Disha Effect : ప్రజావాణిలో బెల్ట్ షాపులపై స్పందించిన తహసీల్దార్, ఎంపీడీవో
దిశ, బషీరాబాద్ : దిశ పత్రికలో వచ్చిన " పసిప్రాయంలోనే మద్యం విక్రయాలు " అనే కథనానికి ప్రజావాణిలో అధికారులు స్పందించారు. బషీరాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో బషీరాబాద్ తహసీల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ… ఆబ్కారీ శాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యానికి గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు కొనసాగుతున్నాయని అన్నారు. బెల్ట్ షాపుల్లో చిన్న పిల్లల చేత మద్యం విక్రయాలు జరుపుతుంటే ఆబ్కారీ శాఖ ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించడంతో ఆబ్కారీ సిబ్బంది "దిశ రిపోర్టర్ " ను వెంటబెట్టుకొని బాలుడు ఇంటికి చేరుకుని వివరాలను ఆరా తీశారు.
MRO :- బడికి వెళ్లాల్సిన బాలుడితో మద్యం విక్రయిస్తున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి బైండోవర్ చేయాలని తహసీల్దార్ ఆబ్కారీ శాఖ అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. ఇకనుండి గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు.