- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వం: ఆచారి
దిశ, తలకొండపల్లి : కేంద్ర ప్రభుత్వం సుమారు 15 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద నిర్మించిన రోడ్డుకు కేసీఆర్ తట్ట మట్టి కూడా వేయలేదని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి తీవ్రస్థాయిలో విమర్శించారు. మండలంలోని వెంకటాపూర్ గేట్ నుండి పడకల్ గ్రామం వరకు ఉన్న మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని ఎందుకు పూర్తిచేయడం లేదని ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి హాజరై స్థానిక ప్రజలతో పాదయాత్ర నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దేవుని పడకల్ గ్రామంలో గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న యువకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆచారి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి, మాటలతో కాలం గడుపుతూ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందాగా తయారయిందని ఆచారి విమర్శించారు. రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేవలం 35 వేల రూపాయలు వరకు మాత్రమే మాఫీ ఇచ్చి, మిగతా రైతులకు మొండి చేయి చూపారని అన్నారు. గ్రామాల్లోని రోడ్ల పరిస్థితి చెప్పనవసరం లేదని, రైతుల గోస వర్ణనాతితమని, రైతుల కలాలలో వడ్లు కొనేవాడు లేడు, అక్కడక్కడ కొన్న వడ్లకు డబ్బులు ఇచ్చే నాథుడే లేడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మూడు కిలోమీటర్ల రహదారి కోసం సంవత్సరం క్రితం డబ్బులు మంజూరు అయితే, కాంట్రాక్టర్ తో మాట్లాడి రోడ్డు వేయించలేని అసమర్ధ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే అని చెప్పడానికి సిగ్గుగా ఉందని ఎద్దేవా చేశారు. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మన ఎమ్మెల్యే గ్రామాల్లో కొబ్బరికాయలు కొట్టడంలో మాత్రం చాలా ముందున్నాడని చమత్కరించాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే గ్రామాలన్ని సస్యశ్యామలం చేస్తామని ఆచారి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ హరిప్రసాద్, సర్పంచ్ కుమార్, ఎంపీటీసీ హేమారాజు, ఉపసర్పంచ్ అనిల్, నాయకులు పాండు, వీరయ్య, పాండు ప్రసాద్, శేఖర్ రెడ్డి, శ్రీశైలం, బండి యాదయ్య, శాంతమ్మ, కృష్ణవేణి, బాలరాజ్, శ్రీశైలం, మన్య నాయక్, పర్వతాలు, శ్రీకాంత్, కృష్ణ గౌడ్ ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.