మునుగోడు ఉపఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం : మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి

by Sumithra |
మునుగోడు ఉపఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం : మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి
X

దిశ, శంషాబాద్ : మునుగోడు ఉపఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీమెజార్టీతో గెలుపొందుతారని శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని చండూరు, బొడంపర్తి గ్రామాలలో శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి గురువారం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ప్రతి ఒక్కరు ఓటు వేసి మరోసారి టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ జెడ్పీటీసీ నీరటి తవ్విరాజ్, కౌన్సిలర్లు అమృతా రెడ్డి, కొనమొల భారతమ్మ, కో ఆప్షన్ సభ్యురాలు కవిత ప్రసాద్, నాయకులు కొలను రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed