- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సురేష్ రోజు నాతో మాట్లాడతాడు : మాజీ ఎమ్మెల్యే పట్నం
దిశ, పరిగి : సురేష్ మా బీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి నాతో రోజు మాట్లాడుతుంటాడు ఎందుకు అతనిని టార్గెట్ చేస్తున్నారంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో సోమవారం ఫార్మా కంపెనీ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై దాడి జరిగిన విషయం పాఠకులకు విధితమే. లగచర్లలో పరిస్థితిని తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మధుసూదనాచారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వస్తుండగా మన్నెగూడ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మన్నెగూడ పోలీస్ స్టేషన్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీ విషయంలో గ్రామస్తులంతా తమ భూములు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారన్నారు. లగచర్ల గ్రామంలో బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు. ఎందుకు కేవలం బి ఆర్ ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. మా బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ రోజు వివిధ పనుల కోసం నాతో మాట్లాడుతుంటాడు అన్నారు. సురేష్ కు కూడా 7 ఎకరాల పొలం ఉందని అతనికి కూడా కడుపు మంట ఉందన్నారు. పొల్యూషన్ వచ్చే కంపెనీలు వద్దంటున్నామన్నారు. టెక్స్ టైల్స్, ఐటీ కంపెనీలు డెవలప్ అయ్యే కంపెనీలు పెట్టమంటున్నాము. పొల్యూషన్ వచ్చే కంపెనీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.