విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

by Kalyani |
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
X

దిశ, ఇబ్రహీంపట్నం : ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని గురుకుల హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నదర్పల్లి గ్రామానికి చెందిన లావణ్య (14) ఇబ్రహీంపట్నం పరిధిలోని చర్ల పటేల్ గూడ( చంద్రయన్గుట్ట ) మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ లో ఉంటూ 10వ తరగతి చదువుతుంది. కాగా విద్యార్థిని తరగతి గదిలో వెనకబడి ఉండడంతో పలుమార్లు ఉపాధ్యాయులు మందలించారు. దీంతో మనస్థాపానికి చెందిన విద్యార్థిని లావణ్య నవంబర్ 9న హాస్టల్లో మొదటి అంతస్తు భాగం నుండి కిందికి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో విద్యార్థినికి వెన్నెముకకు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలై కదలలేని స్థితిలో ఉండింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఈనెల 27న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని ప్రమాదానికి గురిచేసిన ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని తన కుమార్తె కి న్యాయం చేయాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరారు.

Advertisement

Next Story