- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆగని సమ్మె...చదువుకు తప్పని ఇబ్బందులు...
దిశ, వనపర్తి టౌన్: సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె రోజురోజుకు ఉదృత రూపం దాలుస్తోంది. తమ సర్వీసులను క్రమబద్ధీకరించి తక్షణమే పేస్కేల్ వర్తింపజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె పోరుబాట బుధవారానికి 24 రోజుకు చేరింది. దశల వారి ఆందోళనలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2500 మందికి పైగా ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనతో రోడ్డెక్కి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. దీంతో కస్తూర్బా పాఠశాలలో పరీక్ష సమయంలోనే బాలికలకు చదువులు అడుగట్టిపోతున్న పరిస్థితులు దాపరిస్తున్నాయి... కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఇక బడుల్లో పర్యవేక్షణ కొరవడం మధ్యాహ్న భోజనం బిల్లులు నిలిచిపోవడంతో చదువులపై సమ్మె ప్రభావం చూపుతోంది.
ప్రభుత్వ స్పందించే వరకు విరమించని సమ్మె...!
కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2006లో సమగ్ర శిక్షణ ఏర్పాటయింది. జిల్లాలో కేజీబీవీ బోధనేతర, బోధన సిబ్బంది, ఎంఐఎస్ సమన్వయకర్తలు, సిపిఓలు, సీఆర్పీలు, ఐఈఆర్పీలు, మెసెంజర్లు, పిటిఐలు, సిజీవీలు ఉద్యోగాలుగా పనిచేస్తున్నారు. విద్యాశాఖ పర్యవేక్షణలో నిరంత సేవలందిస్తున్నారు సుమారు రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. విద్యాశాఖలో విలీనం చేసిన తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఏలుగా కోరుతున్నారు ఈ డిమాండ్లతో గత ఎడాది సమ్మె కూడా చేశారు. అప్పట్లో వీరి సమ్మె వస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. తమ అధికారంలోకి వస్తే సమస్యలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ హామీ నెరవేరక పోవడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టారు.
ప్రధాన డిమాండ్లు....!
- సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరించాలి..
- ఉద్యోగ భద్రత కల్పించాలి , పే స్కేల్ అమలు చేయాలి..
- ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా అమలు చేయాలి..
- మహిళా ఉద్యోగులకు 180 రోజులు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి..
- పీటీఐలకు మిగతా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు 12 నెలల వేతనం చెల్లించాలి..
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి..: చంద్రశేఖర్ సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా అధ్యక్షుడు
మా ఉద్యోగాలు తమ దగ్గర ఇస్తానని గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇప్పుడు హామీని నిలబెట్టుకోవాలని, పే స్కేల్ అమలు చేయాలి. మా డిమాండ్లపై ప్రభుత్వ స్పందించే వరకు సమ్మె విరమించం.