Prashanth: బీపీఎస్సీ ఎగ్జామ్ రద్దు చేయాలి.. ప్రశాంత్ కిశోర్ నిరాహార దీక్ష ప్రారంభం

by vinod kumar |   ( Updated:2025-01-02 16:14:21.0  )
Prashanth: బీపీఎస్సీ ఎగ్జామ్ రద్దు చేయాలి.. ప్రశాంత్ కిశోర్ నిరాహార దీక్ష ప్రారంభం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల నిర్వహించిన బిహార్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (BPSC) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్ సూరజ్ (Jaj suraj) పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) గురువారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పరీక్షను వెంటనే రద్దు చేసి తిరిగి మళ్లీ నిర్వహించాలి. పోస్టులను అమ్మకానికి పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

కాగా, గతేడాది డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ కండక్ట్ చేయాలని కోరుతూ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో అభ్యర్థులపై పోలీసులు లాఠీ చార్జ్ సైతం చేశారు. అయితే గతంలో వీరికి మద్దతు తెలిపిన ప్రశాంత్ కిశోర్ బీహార్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించక పోవడంతో దీక్ష ప్రారంభించారు.

Read More ....

Supreme Court: దీక్ష విరమింపజేయాలని మేము ఆదేశాలివ్వలేదు.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్


Advertisement

Next Story

Most Viewed