వికారాబాద్​బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేపై ఆరోపణలు

by S Gopi |
వికారాబాద్​బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేపై ఆరోపణలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతుడు, ప్రజారోగ్యం పట్టించుకునే వైద్యుడే ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆ విద్యావంతుడే నమ్ముకున్న కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే తట్టుకోలేక ఒక్కొక్కరుగా తమ బాధను వెల్లడిస్తున్నారు. బీఆర్ఎస్​అధినేత పాత, కొత్త కలయికలతో పార్టీని ముందకు తీసుకెళ్లాలని, అందరితో సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచిస్తే... అందుకు భిన్నంగా క్షేత్రస్ధాయిలోనే ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నట్లు స్పష్టమైతుంది. ఇటీవల కాలంలో వికారాబాద్​ఎమ్మెల్యే వ్యవహారశైలికి వ్యతిరేకంగా మరో వర్గం తమ ఆవేదనను వ్యక్తం చేసేందుకు సిద్దమైయ్యారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పార్టీ పరిస్థితిని బహిర్గతం చేయకుండా సీనియర్​నాయకులపై కేసులు పెట్టించి వేదిస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. వ్యక్తిగతంగా కక్ష్య కట్టి వ్యాపార లావాదేవీల్లో ఎమ్మెల్యే కలుగజేసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అసమ్మత్తి వర్గం నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అధినేత కేసీఆర్, వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​లు తానేమీ చేసినా పట్టించుకోరనే వ్యవహారంతో నేల వీడిచి సాము చేస్తున్నారనే విమర్శులున్నాయి. అధిష్టానం వికారాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసే ఆగడాలపై క్షేత్రస్ధాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సీనియర్​బీఆర్ఎస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మండల కేంద్రాల్లో పార్టీ కార్యక్రమాలు జరిగితే సీనియర్లను దూరం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులైన సీనియర్​నాయకులకు, వారి అనుచరులకు దక్కకుండా వ్యవహారిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆనంద్ చేసే ఆగడాలకు అదుపు లేకుండా పోయిందనే చర్చ తీవ్రంగా నడుస్తుంది. మళ్లీ ఆనంద్ కే బీఆర్ఎస్​టికెట్ఇస్తే పార్టీ ఒటమి తప్పదని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

Advertisement

Next Story