- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తాండూర్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు
దిశ, తాండూర్ : మండలం లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ జడ్పీటీసీ సాలిగామ బానయ్య, మంచిర్యాల జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం (ఫిషరీస్) చైర్మన్ కంపెల చిన్నయ్య, పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హైదరాబాద్ లోని తన నివాసంలో సోమవారం వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బానయ్య, చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎనిమిది నెలలో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకారంతో మండల అభివృద్ధికి శాయశక్తులకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం రవీందర్ రెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్ రావు, నాయకులు పేరం శ్రీనివాస్, రహమతుల్లా, సల్వాజి గాంధీ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.