Shadnagar MLA : రుణమాఫీపై తప్పు దొర్లిన ఖాతాలను సరి చేయండి

by Aamani |
Shadnagar MLA : రుణమాఫీపై తప్పు దొర్లిన ఖాతాలను సరి చేయండి
X

దిశ,షాద్ నగర్ : ప్రతి రైతుకూ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రుణమాఫీ అమలులో కుటుంబ సభ్యుల నిర్ధారణ, లోన్ రెన్యువల్ తేదీల్లో తప్పులను అలాగే ఆధార్ నెంబర్ తప్పు దొర్లిన ఖాతాలను సరిచేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యవసాయ అధికారుల, బ్యాంకర్లతో రుణమాఫీ పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.రైతుల ఖాతాల్లో దొర్లిన తప్పులను సరిచేసి వాటిని పై అధికారులకు నివేదించి రుణ మాఫీ అందేటట్లు చూడాలని ఎమ్మెల్యే బ్యాంకర్లను, వ్యవసాయ అధికారులకు కోరారు.బ్యాంకుకు వచ్చే ప్రతి రైతుకూ రుణమాఫీ పై పూర్తి వివరాలు ఇచ్చి వారికి సలహాలు, సూచనలు చేయాలని కోరారు.

ప్రతి బ్యాంక్ వారు తాము ఇచ్చిన రుణాల జాబితాను తయారు చేసి రుణమాఫీ ఎంత మందికి అయ్యింది అలాగే రుణ మాఫీ కానీ వారి జాబితాను తయారు చేసి అర్హులైన ప్రతి ఖాతా దారుడికి రుణమాఫీ అయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే తెలిపారు.సాంకేతిక సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి, బ్యాంకర్ ల దృష్టికి తీసుకుపోవాలని తెలిపారు.అర్హులైన రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ప్రభుత్వం ‘రైతు భరోసా పంట రుణ మాఫీ యాప్ ను తీసుకొచ్చింది అని తెలిపారు. సాంకేతిక సమస్యలతో మాత్రమే రైతులకు రుణమాఫీ కాలేదని, రుణమాఫీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల్ రాజ్ గౌడ్, జగదీష్ అప్ప, మండల అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,హరినాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story