- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sabitha Indra Reddy : హైడ్రాకు భయపడాల్సిన పనిలేదు,నేను మీకు అండగా ఉంటా
దిశ, మీర్ పేట్ : కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు, చందనం చెరువు సమీపంలోని ఎఫ్డిఎల్, బఫర్ జోన్ లలో నివసిస్తున్న నిరుపేద ప్రజలు హైడ్రా కు భయపడాల్సిన అవసరం లేదు నేను మీకు అండగా ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని సర్వోదయ నగర్ కాలనీ, యం ఎల్ ఆర్ కాలనీ, ప్రగతి కాలనీ, శివాజీ నగర్ వాసులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి హైడ్రా గూర్చి వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాజకీయ దురుద్దేశంతో చెరువు దగ్గరకు వచ్చి నియోజకవర్గంపై ఎలాంటి అవగాహన లేకుండా ఇష్టానుసారంగా కొంతమంది మాట్లాడుతున్నారని ముందుగా ఈ చెరువు కింది ప్రాంతంలో 5000 కుటుంబాలు 30 సంవత్సరాలుగా నివసిస్తున్నారని ఏ విధంగా కులుస్తారన్నారు.ఈ కార్యక్రమంలో సర్వోదయ నగర్ కాలనీ అధ్యక్షుడు రామచంద్ర, సిద్దయ్య, శివకుమార్, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, శుభం, శ్రీనివాసరావు, శ్రీకాంత్, పాపయ్య, వీరస్వామి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.