కేసీఆర్​ చేపట్టిన బృహత్తర పథకమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Sumithra |   ( Updated:2023-04-26 14:43:43.0  )
కేసీఆర్​ చేపట్టిన బృహత్తర పథకమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, బడంగ్​పేట్​ : అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని డబల్ బెడ్ రూమ్ పనుల పై జిల్లా శాసనసభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ పేదప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన బృహత్తర పథకమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తిచేసి లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇళ్ళ నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మించిన ఇళ్ళను పూర్తిస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు అందజేయాలని సూచించారు. కొత్తగా ఇళ్ళు నిర్మిస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలైన రోడ్డు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజి సదుపాయాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో ఎక్కడెక్కడ పూర్తి కానీ ఇళ్ళ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎల్.బి.నగరర్​ ఎమ్మెల్యే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అంజయ్య యాదవ్, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్,ఆర్డీఓలు వెంకటాచారి, రాజేశ్వరి, వేణుగోపాల్, సూరజ్, పరిశ్రమల శాఖ,హౌసింగ్ అధికారి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed