- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajendra Nagar MLA : మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి
దిశ, శంషాబాద్ : మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే (Rajendra Nagar MLA ) ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి అధ్యక్షతన మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పాలకవర్గ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. శంషాబాద్ మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన కొరకు 4.50 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేయుట కొరకు పాలకవర్గం ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడ మున్సిపాలిటీ అని ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు గత నాలుగున్నర ఏండ్లుగా కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 25 వార్డులలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంచినీటి పైప్ లైన్లు లాంటి మౌలిక వస్తువులు కల్పనకు పెద్దపీట వేసి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు దాదాపు మున్సిపాలిటీలో 90% పనులు పూర్తయ్యాయని మిగతా పనులు అన్నింటిని కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని అభివృద్ధి లక్ష్యంగా విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిలో చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉండటం వల్లే ఇంతగా అభివృద్ధి కొనసాగింది అన్నారు.
ఇకముందు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో శంషాబాద్ మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 80 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకురావడం వల్లే 25 వార్డులలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నూతన మంచినీటి పైప్ లైన్లు, లాంటివి వేయడంతో మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు అందరూ సహకరించడం వల్లే అభివృద్ధి కొనసాగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.