గురుకులంలో సమస్యల తిష్ట..అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాల

by Aamani |
గురుకులంలో సమస్యల తిష్ట..అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాల
X

దిశ, యాచారం: గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో సకల వసతులతో పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయి. వివరాల్లోకి వెళితే..మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శంషాబాద్ గురుకుల పాఠశాలలో 500 మంది వరకు చదువుతూ ఉండగా సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 14 వరకు శౌచాలయాలు ఉండగా అందులో కొన్నిటికి డోర్లు లేక మరి కొన్నిటికి డోర్లు సరిగా పనిచేయక ఉన్న 8 వాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు. స్కూల్ టైం వరకు సిద్ధం కావడానికి ప్రతిరోజు సాహసమే చేయాల్సి వస్తోంది. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో శౌచాలయాలు పక్కనే పేరుకుపోయిన మురికి నీటి కుంటతో వాటి నుంచి వచ్చే దుర్వాసన అందులో పెరిగే దోమల ఈగలతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. తరగతి గదులకు డోర్లు, పడకగదులలో వేలాడుతున్న లైట్లు నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నాయి. శిథిలమవుతున్న అద్దె భవనంలో గురుకుల పాఠశాల కొనసాగడం విద్యార్థులకు ఒక శాపం గా మారింది. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

చలికి వణుకుతున్న భావితరం..

విద్యార్థులు పడుకుంటున్న గదులకు కిటికీలు లేకపోవడంతో చలికి గజ గజ వణుకుతున్నారు. కిటికీలకు బొంతాలను మాత్రమే ఏర్పాటు చేసి వదిలి వేయడంతో నరకం అనుభవిస్తున్నారు.

అధికారుల దృష్టికి సమస్యలు.. పరిష్కారమయ్యేనా..?

జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కా, 14వ తేదీ గురుకుల పాఠశాలను సందర్శించగా ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పక్క భవన నిర్మాణం డిగ్రీ కళాశాలతో పాటు గురుకుల పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు.

Advertisement

Next Story