ప్రత్యేక టూరిజం అభివృద్ధిలో మెదక్‌ను చేర్చాలి : శేరి సుభాష్ రెడ్డి

by Aamani |
ప్రత్యేక టూరిజం అభివృద్ధిలో  మెదక్‌ను చేర్చాలి : శేరి సుభాష్ రెడ్డి
X

దిశ, మెదక్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక టూరిజం అభివృద్ధి ప్యాకేజీలో మెదక్ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను చేర్చాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కోరారు. బుధవారం శాసన మండలి లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక టూరిజం అభివృద్ధిలో మెదక్ లో ఉన్న ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం చేర్చలేదని తెలిపారు. రాష్ట్ర రాజధానికి కేవలం వంద కిలో మీటరు దూరం నర్సాపూర్ అర్బన్ పార్క్, జైన పార్శ నాథుడి ఆలయం, ప్రఖ్యాత పుణ్య క్షేత్రం ఏడుపాయల, ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి, మెదక్ లో కాకతీయుల నాటి ఖిల్లా, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టు ఇలా పర్యాటక ప్రాంతాలు ఉన్న ప్రత్యేక టూరిజం లో చర్చలేదున్నారు. పర్యాటకులకు అందుబాటులో రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉన్న మెదక్ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలో చేర్చాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed