- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇసుక డంపులు సీజ్ చేసిన మళ్లీ ప్రత్యక్షం
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: గత శుక్రవారం దిశ లో 'ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలి' వచ్చిన వార్తపై స్పందించిన నారాయణపేట పోలీసులు, మైనింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు అదే రోజు సాయంత్రం సీజ్ చేసిన సంగతి విధితమే. సీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే సూరారం చిన్న వాగు నుంచి ఇసుకను అక్రమంగా డంపింగ్ చేసి రవాణాకు సిద్ధం చేసినట్లు సామాజిక కార్యకర్త, నేను సైతం స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..పోలీసులు, అధికారులు ఇసుక సీజ్ చేసి వారం రోజులు తిరక్కుండానే మళ్ళీ ఇసుక గుట్టలు గుట్టలుగా పోసి నిల్వ చేశారని ఆయన ఆరోపించారు. అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు చూపించారు. ఇసుక అక్రమ రవాణాను వెలుగులోకి తెచ్చినా..మాఫియా పట్టించుకోకుండా యధా చ్చేదంగా ఇసుకను అక్రమంగా నిలువ చేయడం విస్మయానికి గురి చేసిందన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక వారు కమ్మకుకావడమా అని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జోక్యం చేసుకొని ఇసుక అక్రమ రవాణాదారులపై చర్యలు చేపట్టి,ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.