- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో విద్యుత్ రంగం ఊహించని పురోగతి సాధించింది: సబితా ఇంద్రారెడ్డి
దిశ, మహేశ్వరం: తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణలో విద్యుత్ రంగం ఊహించని పురోగతి సాధించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండల కేంద్రంలోని సామ నరసింహా రెడ్డి ఫంక్షన్ హాల్లో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్ వెలుగులు చిమ్ముతున్నాయని, 2014 ముందు రైతన్నలు కరెంట్ కోసం పడిగాపులు కాసేవారని, నేడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు, నాయి బ్రాహ్మణులకు 250, రజకులకు లాండ్రీ ఇస్త్రీ కోసం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో విద్యుత్ కోసం రూ. 2500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్ కుమార్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.