- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాల్లు మొక్కుతా..పాఠశాలను బాగు చేయండి..
దిశ, పరిగి : కాళ్లు మొక్కుతా మా పాఠశాలను పట్టించుకొని బాగు చేయమని ఓ ఉపాధ్యాయుడు స్థానిక నాయకులు, పాలకులకు వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిండ్రులు తప్పుపడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడ్డాక విద్యావస్థను పటిష్టం చేస్తూన్నా కొన్ని పాఠశాలలపై ఇంకా చిన్నచూపే కనిపిస్తోంది. మన ఊరు–మన బడి అంటూ పాఠశాలల అభివృద్దికి శ్రీకారం చుట్టినా పాఠశాలల దుస్తితిలో ఎలాంటి మార్పులేదని చెప్పుకోవచ్చు. ఇందుకు ఉదాహరణే పరిగి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులోని మల్లెమోనిగూడ ప్రాథమికోన్నత పాఠశాల అని చెప్పుకోవచ్చు. ఈ పాఠశాలను బాగు చేయండి సార్ మీ కాళ్లు మొక్కుతా అని ఉపాధ్యాయుడు వెంకట ప్రసాద్ చాలా సందర్బాల్లో పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని పెదవి విరుస్తున్నారు.
బండలు పైకి తేలిన నేల గదులు.. పెచ్చులూడుతున్న పై కప్పు..
పరిగి మున్సిపల్ పరిధిలోనే ఇంత దయనీయ పరిస్థితిలో ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ మల్లమోనిగూడ గ్రామస్తులు చెబుతున్నారు. మున్సిపల్ లోనే ఇంత అధ్వాన్న స్థితిలో పాఠశాల ఉండటం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మొత్తం 90 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల రోజురోజుకు శిథిలావస్తుకు చేరడం వల్లే 130 మంది వరకు ఉన్న విద్యార్థులు పాఠశాలలో సంఖ్య క్రమేపీ తగ్గూతూ వస్తూ ప్రైవేటును ఆశ్రయిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. వంట గది కోసం బేసిమెంట్ వరకు వేసి వదిలేశారు. పాఠశాలలో బూత్ రూంలు కూడా పూర్తిగా అధ్వాన్నంగా మారి ఉపయోగానికి వీలులేదని మహిళా ఉపాధ్యాయురాలు, విద్యార్థులు చెబుతున్నారు.
పన్నెండేళ్లుగా ఎలాంటి అభివృద్ది లేదు : పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య
మా పాఠశాలలో గదులన్నీ శిథిలావస్తకు చేరుకున్నాయి. ఏడు తరగతులకు ఐదు గదులున్నా పూర్తి శిథిలావస్తలోనే ఉన్నాయి. బడి గదల బండల కింద నుంచి తేల్లు, పాములు వస్తున్నాయి. బాత్ రూంలు అధ్వాన్నంగా మారి చెత్తా చెదారంతో నిండి వాడేందుకు వీలులేకుండా పోయింది. రెండు గదులే బాగున్నా ఒక గదిలో ఆఫీస్ రూంకు వాడుకుంటున్నాము. పాఠశాల పరిస్థితి పై పన్నేండేళ్లుగా నాయకులు, పాలకులు, అధికారులు దృష్టికి తీసుకువెళ్లాము. బాగు చేయిస్తామని చెబుతున్నారు. పాఠశాల పరిస్థితి చూసి తల్లిదండ్రులు విద్యార్థులను బడికి పంపించేందుకు వెనకడుగు వేస్తున్నారు. పాఠశాలను బాగు చేస్తే విద్యార్థుల సంఖ్య పెరిగి పాఠశాల అభివృద్ది చెందుతుంది.