- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Kasireddy : ప్రజా పాలన ఓర్వలేక ప్రతిపక్షాల కుట్రలు
దిశ,ఆమనగల్లు::- ప్రజల ఆశీస్సులు పొందుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు అండగా ఉన్నారని, నిరుద్యోగుల ఆకాంక్షలను నీరు గాడ్చేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. సోమవారం కడ్తాల్,ఆమనగల్లు మండలాల 84 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు ఆయిలళ్ల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మార్వోలు లలిత,ముంతాజ్ బేగం ఎంపీడీఓ సుజాత, డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ, మండల అధ్యక్షులు భిచ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రి నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలి ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డి సూచించారు. రూ 17.50 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్మాణ పనులను పరిష్కరించి కాంట్రాక్టర్ కు తగు సూచనలు అందజేశారు. నాలుగు మండలాలకు కూడలిగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పకడ్బందీగా అన్ని హంగులతో నిర్మించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు వస్పూల జంగయ్య, కృష్ణ నాయక్,మాజీ ఎంపీపీ అనిత విజయ్,మండల అధ్యక్షులు జగన్, మానయ్య,నాయకులు శ్రీశైలం, బాబా,విజయ్ రాథోడ్, ఫరీద్,మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.