- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sanitation : వీరి ఆరోగ్యానికి భరోసా ఉందా..
దిశ,కొత్తూర్ : ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం తీవ్రంగా శ్రమించే గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ కవచాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే ఇది వ్యాదుల (వర్షాకాలం). ఈ కాలంలో వృత్తి పరమైన ప్రమాదాలు,ఆరోగ్య ప్రమాదాలకు వారు గురి కాకుంగా ఉండటానకి చేతి తొడుగులు, ముసుగులు, బూట్లు, రైన్ సూట్లు వంటి సరైన రక్షణ కవచాలు లేకుండా నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నారు. దీని వల్ల వీరికి అంటువ్యాధులు, ఇతర గాయాలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ఆస్కారం లేకపోలేదు. కోడి కూయక ముందే లేసి రోడ్లు ఊడ్చి ఇంటి ఇంటికి తిరుగుతూ చెత్త సేకరించే పంచాయతీ కార్మికుల కోసం అధికారులు కనీస వ్యక్తిగత రక్షణ పరికరాలు ఏర్పాటు చేయడంలో విఫలమైయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పారిశుధ్య కార్మికులు ప్రజలకు అవసరమైన సేవను అందిస్తారు. అలాంటి వారు ఆరోగ్యంగా ఉంటేనే ఊరూ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వారికి వ్యక్తిగత రక్షణ పరికరాలు అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.
అనారోగ్యం బారినపడకుండా హెల్త్‌కిట్లు ఇవ్వాలి...
తమ ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని పారిశుధ్య కార్మికుల కోరుకుంటున్నారు.తమ ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ కవచాలు అందజేయాలని అంటున్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తుగా హెల్త్ కిట్లను పంపిణీ చేయాలని,అలాగే గ్లౌజులు, షూస్, మాస్కులు రైన్ సూట్లు తప్పని సరిగా ఇవ్వాలని కోరుకుంటున్నారు.
అసలు గ్రామాలను పట్టించుకునే నాథుడున్నాడా...
సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామపంచాయతీల పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లింది. కానీ ఈ ప్రత్యేక అధికారులు గ్రామల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటూ స్వయాన పంచాయతీ అధికారులే అంటున్నారు. కనీసం చుట్టపు చూపుగా అయినా రావడం లేదంటున్నారు. ఇలాంటి అప్పుడు గ్రామ సిబ్బంది వారి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అనే ప్రశ్నలు పంచాయతీ కార్యదర్శులు లేవనెత్తడం కొసమెరుపు. అసలు గ్రామాలను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఈ నామ మాత్రపు ప్రత్యేక పాలకులు ఉండి దండుగ అంటూ ప్రభుత్వం వీలైనంత తొందరగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపించాలని ప్రజలు అంటున్నారు.
ఎమ్మెల్యే గ్రామాల పర్యటన చేయాలి..
స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామాల పర్యటన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కరువవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నవి.ముఖ్యంగా గ్రామాలకు నిధుల సమస్య ఉండటంతో అభివృద్ధి కుంటుపడింది, వీలైనంత తొందరగా ఎమ్మెల్యే గ్రామాల పర్యటన చేసి ప్రజా సమస్యలను,పంచాయతీ పరిశుద్ధ కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు, కార్మికులు కోరుకుంటున్నారు.