బైక్ ఢీకొని.. పంచాయతీ కార్మికురాలు మృతి

by Shiva |   ( Updated:2024-01-13 17:32:04.0  )
బైక్ ఢీకొని.. పంచాయతీ కార్మికురాలు మృతి
X

దిశ, యాచారం : బైక్ ఢీకొని గ్రామ పంచాయతీ కార్మికురాలు మృతిచెందిన ఘటన గడ్డ మల్లయ్యగూడలో ఇవాళ చోటుచేసుకుంది. గున్‌గల్ గ్రామానికి చెందిన భూమగళ్ల భారతమ్మ (50) గ్రామ పంచాయతీ కార్మికురాలిగా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తోంది. ఇవాళ సాయంత్రం గడ్డ మల్లయ్యగూడ వద్ద రోడ్డు దాటుతుండగా మంచాల మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన వెలగపల్లి జగదీష్ (24) గ్లామర్ బైక్‌పై అతివేగంగా వచ్చి భారతమ్మను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదయ్య తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన భూమగళ్ల భారతమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed