- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహాత్మా మన్నించు.. మా నాయకులు మారరు
దిశ,కొత్తూరు: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మంగళవారం మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఇంతవరకు బాగానే వుంది. మహానుభావులను స్మరించుకోవాలి, మనం వారి అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం కూడా ఎంతైనా వుంది. మండలకేంద్రంలో వున్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి దాదాపు 4సంవత్సరాల క్రితం చేతి విరిగిపోయింది. జయంతి, వర్ధంతి సమయాలలో ఎంతో హడావిడి చేసే మన నాయకులకు మాత్రం ఇది కనిపించడం లేదు.
ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి సమయాలలో రావడం హడావిడి చేయడం వెళ్లడం. నాయకులకు తమ గుర్తింపుపై వున్న శ్రద్ద మనకు ఆదర్శమైన మహనీయుల విగ్రహాలపరిరక్షణపై లేదని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా విగ్రహం డ్యామేజి అయిన కనీసం పట్టించుకునే నాథుడు లేడు.మంగళవారం నిర్వహించిన జయంతి ఉత్సవాలల్లో విరిగిన విగ్రహం చేతిని పూలతో కవర్ చేసిన నాయకులు. కనీసం మరమ్మత్తులు చేయించాలని మరవడం గమనార్హం. విరిగిన చేతిని కవర్ చేసిన వైనానికి ముక్కున వేలేసుకుంటున్నారు. మహాత్మా మమ్మల్ని మన్నించు. మా నాయకులు ఇంతే. మళ్ళీ వర్ధంతికి కదా నిన్ను మేము స్మరించుకునేది.