- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అభ్యంతరాల సమర్పనకు నోటిఫికేషన్ జారీ
దిశ బ్యూరో, రంగారెడ్డి : 2014లో తెలంగాణ ప్రభుత్వం తొలగించిన బీసీ కులాల నుంచి ప్రాతినిధ్యాలు, అభ్యంతరాలను సమర్పించడానికి నోటిఫికేషన్ జారీపై 26 బీసీ కుల సంఘాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు ఆర్. కృష్ణయ్య సహాయ సహకారాలతో దాదాపు 8 ఏండ్లు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సుదీర్ఘమైన పోరాటాలు చేశామన్నారు.
దీని ఫలితంగానే తెలంగాణలో తొలగించిన 26 బీసీ కులాల స్థితిగతులను విధిగా ధృవీకరించిన తర్వాత సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం శుభసూచికం అన్నారు. ఒక నెలలో అంటే సుప్రీంకోర్టు గడువు తేదీతో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరాలు లేకుండా తొలగించిన మొత్తం 26 కులాలను తిరిగి చేర్చడానికి ఉత్తర్వులు జారీ చేస్తుందని తాము గట్టిగా ఆశిస్తున్నామని తెలిపారు. తొలిగించిన 26 కులాల పోరాటాలకు సహకరించినందుకు తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీలకు, బీసీ సంఘాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆళ్ల రామకృష్ణ చెప్పారు.