CM Chadrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అసలు విషయం అదే!

by Shiva |
CM Chadrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అసలు విషయం అదే!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన హస్తినకు వెళ్లనున్నారు. ఉదయం ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. సభ ప్రారంభం అయిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav), గొట్టిపాటి రవికుమార్‌ (Gottpati Ravi Kumar)లు ఉద్యోగుల సర్వీసు (Employee Service), ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు (Electricity Amendment Bill)లను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కేటాయింపులపై సభలో చర్చ కొనసాగనుండగా.. అందుకు మంత్రి పయ్యావుల సమాధానం ఇవ్వనున్నారు.

అనంతరం సీఎం చంద్రబాబు (CM Chandrababu) వెలగపూడి (Velagapudi)లోని సచివాలయం (Secretariat) ఎదురుగా ఉన్న హెలి‌ప్యాడ్ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి (Gannavaram Airport) చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. సాయంత్రం 3.45కు అక్కడికి చేరుకుని 4 గంటలకు ఓ మీడియా క్లాన్‌కేవ్‌‌లో పాల్గొననున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు (CM Chandrababu) కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు కీలక అంశాలపై ఆయన చర్చించనున్నారు. అదేవిధంగా శనివారం సీఎం ఢిల్లీ (Delhi) నుంచి నేరుగా మహారాష్ట్ర (Maharastra)కు వెళ్లనున్నారు. అక్కడ ఎన్డీఏ (NDA) తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Advertisement

Next Story