స్టార్ కమెడియన్ కొడుకుతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ.. 'న్యూ బిగినింగ్' అంటూ పోస్ట్

by Kavitha |
స్టార్ కమెడియన్ కొడుకుతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ.. న్యూ బిగినింగ్ అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌లలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అంతే కాకుండా పలు షోలలో కనిపిస్తూ పాపులర్ కూడా అయింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. అప్పుడప్పుడు ట్రోలింగ్ కూడా జరుగుతుంది అది వేరే విషయమనుకోండి. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుపోతుంటది. ఇక ఎప్పుడు నెట్టింట యాక్టీవ్‌గా ఉంటే ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా రీతూ చౌదరి తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్టార్ కమెడియన్ శివాజీ రాజా కుమారుడు విజయ్‌ రాజాతో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. అలాగే బెడ్ రూమ్, కంటైనర్ ఫార్మ్ స్టే , ప్రైవేట్ పూల్, ఔట్ డోర్ థియేటర్, ఈవెంట్ స్పేస్ ఉన్న పిక్స్ పెట్టింది. అంతే కాకుండా ‘న్యూ బిగినింగ్’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక రీతు చౌదరి పోస్టును చూసిన నెటిజన్లు చాలా మంది విజయ్ రాజాతో ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారని అభిప్రాయపడుతున్నారు. కాగా రీతూ, విజయ్ కలిసి హాస్పిటాలిటీ, ఆతిథ్య రంగంలో sukha farm stay పేరుతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story