Children's Day: స్టార్ హీరోయిన్ "చిల్డ్రన్స్ డే" స్పెషల్ డిష్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే(పోస్ట్)

by Kavitha |
Childrens Day: స్టార్ హీరోయిన్ చిల్డ్రన్స్ డే స్పెషల్ డిష్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే(పోస్ట్)
X

దిశ, సినిమా: సాధారణంగా క్రికేటర్స్‌కు, సెలబ్రిటీలకు మంచి రిలేషన్ ఉంటదన్న సంగతి తెలిసిందే. వీరు కలిసి అనేక యాడ్స్ చేస్తుంటారు. అలా చేస్తున్న టైంలోనే ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వారిలో విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జంట ఒకటి. అలా కొన్నేళ్ల ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఒక పాప, బాబు(వామిక, అకాయ్ ) కూడా జన్మించారు. కానీ వాళ్ల ఫేస్‌లు మాత్రం ఇప్పటి వరకు రివీల్ చేయలేరు. దీంతో ఫ్యాన్స్ పాప, బాబు ఫేస్ ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నిన్న చిల్డ్రన్స్ డే అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు తన చైల్డ్ హుడ్ ఫొటోలను షేర్ చేస్తూ విషెస్ తెలిపారు. ఈ క్రమంలో అనుష్క శర్మ వినూత్నంగా ఓ డిష్‌తో చిల్డ్రన్స్ డే విషెస్ తెలిపుతూ ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి బాలల దినోత్సవం సందర్భంగా అనుష్క తన పిల్లలిద్దరి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన డిష్ ఏంటంటే.. నూడుల్స్. దీనిని అనుష్క ఒక గిన్నెలో ఉంచి చిల్డ్రన్స్ డే మెనూగా తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్న ఎమోజీలు పెట్టి షేర్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అనుష్క స్పెషల్ డిష్‌ను చూసేయండి.

Advertisement

Next Story