సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు..సిబ్బందితో కమిషనర్ సేకరణ

by Aamani |
సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు..సిబ్బందితో కమిషనర్ సేకరణ
X

దిశ, మేడ్చల్ టౌన్: సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలయ్యాయి. జాతీయ రహదారి పొడవునా ఫారాలు దర్శనమిచ్చాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్- నిజామాబాద్ దారిలో రేకుల బావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా గురువారం సాయంత్రం పూరించని సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శమిచ్చాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి హుటాహుటీన సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు.

అన్ని ఫారాలను సేకరించి, తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమైన కమిషనర్ ను వివరణ కోరగా జాతీయ రహదారి వెంట సమగ్ర కుటుంబ సర్వే పడి ఉన్నట్లు తనకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి, దరఖాస్తులను సేకరించామన్నారు. అర్ధ కిలో మీటర్ మేరకు దరఖాస్తు ఫారాలు పడి ఉన్నాయని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed