- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షార్ట్ సర్క్యూట్‌తో లాండ్రీ దగ్ధం..
దిశ,హుస్నాబాద్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో లాండ్రీ దగ్ధమైన ఘటనలో విలువైన దుస్తులతో పాటు పట్టు చీరలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన హుస్నాబాద్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు ఉప్పరపల్లి ఇస్తారి ఇచ్చిన సమాచారం మేరకు… పట్టణంలోని సిద్దిపేట రోడ్డు లో గల కోరమండల్ ఫర్టిలైజర్ పక్కన 10 ఏళ్లుగా ఇస్తారి లాండ్రి షాపు నిర్వహిస్తున్నాడు. అందరికీ చిరపరిచితులు కావడంతో లాండ్రిలో అధిక మంది ఉద్యోగులు, గృహస్తులు దుస్తులు ఇస్తుంటారు. రోజు మాదిరిగానే గం.7 లకు షాపు మూసేసి ఇంటికి వెళ్ళాడు.
కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో 100 కి పైగా పట్టు చీరలు ఇస్త్రీ కోసం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో దుకాణం అగ్నికి ఆహుతైంది. రాత్రి సమయంలో దుకాణం నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన స్థానిక కౌన్సిలర్ వల్లపు రాజు, కాంగ్రెస్ నాయకులు బేక్కంటి రాజయ్య, విక్రమ్, దామోదర్ బాధితుడికి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో లక్ష రూపాయల విలువ గల దుకాణం తో పాటు అందులో ఉన్న లక్ష రూపాయలు విలువైన వస్త్రాలు, పట్టు చీరలు, దుస్తులు అగ్నికి ఆహుతి కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు గురవయ్య వాపోయాడు. ప్రభుత్వం స్పందించి బాధితున్ని ఆదుకోవాలని రజక సంఘం అధ్యక్షుడు పున్న సారయ్య ప్రభుత్వాన్ని కోరారు.