కేసీఆర్ చరిష్మా ను ఎవరు చెరిపి వేయలేరు : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

by Kalyani |
కేసీఆర్ చరిష్మా ను ఎవరు చెరిపి వేయలేరు : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, ఆర్కేపురం: కేసీఆర్ చరిష్మా ను ఎవరు చెరిపి వేయలేరు అని, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆర్కే పురం డివిజన్ లోని సురభి హోటల్ లో డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కష్టపడి నన్ను మంచి మెజార్టీతో గెలిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో పనిచేసి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపిద్దామన్నారు.

బీఆర్ఎస్ పార్టీ 63 లక్షల మంది సభ్యత్వం కలిగిన పార్టీ అని, కొంతమంది నాయకులు స్వలాభం కోసం పార్టీ మారుతున్నారన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన నాయకులకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వస్తే లాభనష్టాలను బేరీజు చేసుకొని పని చేస్తారని అన్నారు. నిరంతరం ప్రజలకు సేవ చేసే బడుగు బలహీనవర్గాల నాయకుడైన కాసాని ని గెలిపిద్దామని అన్నారు. 70 ఏళ్ల పైబడిన కేసీఆర్ ఎండిన పంటలు పరిశీలిస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచ్ కోసం స్టేడియంలో సినీ హీరోల పక్కన కూర్చుని సేద తీరుతున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు పాలన చేతకాక, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని విమర్శిస్తున్నారన్నారు. ఈ సీఎంకు ప్రజా సమస్యల మీద అవగాహనలేదని, ప్రజలకు ఏమి కావాలో ఆలోచించే శక్తి లేని వ్యక్తి అని అన్నారు. కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని ఆ విజయంతోనే ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా పదేళ్లు పరిపాలన సాగించాడని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీధర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, నియోజకవర్గ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునీత రెడ్డి, రామ్ నరసింహ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, మహిళ ఆద్యక్షురాలు లిక్కి ఊర్మిళ రెడ్డి, మంత్రి రవీందర్ రావు, దుబ్బాక శేఖర్, రామాచారి, గొడుగు శ్రీనివాస్ , వెంకటేష్ గౌడ్ , సాజిద్, మురళీధర్ రెడ్డి, శ్యాంగుప్త, రహీం, రమేష్, అనురాధ, శ్రీనివాస్ రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, పెంబర్తి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed