Navagraha idols : ఎయిర్పోర్ట్ కాలనీలో దుండగుల దుశ్చర్య.. నవగ్రహ విగ్రహాలు ధ్వంసం..

by Sumithra |   ( Updated:2024-11-05 07:57:53.0  )
Navagraha idols : ఎయిర్పోర్ట్ కాలనీలో దుండగుల దుశ్చర్య.. నవగ్రహ విగ్రహాలు ధ్వంసం..
X

దిశ, శంషాబాద్ : గుర్తు తెలియని దుండగులు హనుమాన్ దేవాలయం ముందున్న నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ కాలనీలో హనుమాన్ దేవాలయం ముందు ఉన్న నవగ్రహ విగ్రహాలను మంగళవారం తెల్లవారుజామున ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అది గమనించిన అయ్యప్ప భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని దేవాలయం పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. హిందూ దేవాలయాల పై దాడులను ఖండిస్తూ ధర్నాకు దిగడంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అక్కడకు చేరుకుని ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను పరిశీలించి హిందూ సంఘాలకు సంఘీభావం తెలిపారు.

రాజేంద్రనగర్ జోన్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, ఏసీపీ శ్రీనివాస్ రావు బృందం ఎయిర్పోర్ట్ కాలనీకి చేరుకొని విగ్రహాల ధ్వంసానికి పరిశీలించి వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తూ కాలనీకి వచ్చే దారులన్నీ మూసివేశారు. ఎయిర్ పోర్ట్ కాలనీకి ఇతరులని ఎవరిని అనుమతించడం లేదు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు, హిందూ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ హిందూ దేవాలయాల పై దాడులు జరగడం చాలా బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరాగం కాకుండా పోలీసులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.‌ ఈ ఘటనకు పాల్పడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టిన పరిస్థితి లేదని చట్టపరంగా అతని పై చర్యలు తప్పమన్నారు. ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలన్నారు. ఎవరు ఆందోళనకు గురి కావద్దని అన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై దాడులు విపరీతంగా పెరిగాయని దీని పై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరన్నారు. నువ్వు కూడా ఒక హిందువు కదా రోజు పూజలు చేస్తావు కదా నువ్వు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. తెల్లవారుజామున నవగ్రహాల పై దాడి జరిగితే పోలీసులు వచ్చి పరిశీలించి కేసులు నమోదు చేశారే కానీ నిందితులను గుర్తించకపోవడంలో విఫలమయ్యారన్నారు. దేవాలయాల పై దాడి జరిగితే హిందూ సంఘాలు వస్తుంటే వారిని రాకుండా పోలీసులతో కట్టడి చేస్తున్నారన్నారు. నిందితులను శిక్షాల్సిన పోలీసులు అమాయకులను హిందువుల పై ప్రతాపం చూపుతున్నారని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు ఎవరో వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు.

శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ మాట్లాడుతూ నవగ్రహ విగ్రహాల పై దాడి చేసిన హనుమాన్ నిధులను గుర్తించి అదుపులో తీసుకున్నామని అతని పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశామన్నారు ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్పోర్ట్ కాలనీలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed